: బీజేపీని తాచుపాముతో పోల్చిన శివసేన!


బీజేపీని తాచుపాముతో పోల్చిన శివసేన ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. మహారాష్ట్ర పురపాలక ఎన్నికల ప్రచారఘట్టం తుదిదశకు చేరుకుంటున్న నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. మిత్రపక్షాలుగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ-శివసేన విమర్శలతో కత్తులు దూసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, బీజేపీ కోరలు చాచిన తాచుపాము అన్నారు. గత పాతికేళ్లుగా తాము కోరలు చాచిన తాచుతో కలిసి ఉన్నామని పేర్కొన్నారు. కోరలు చాచి కాటేయాలని చూస్తున్న ఆ పామును ఎలా నలిపివేయాలో తమకు బాగా తెలుసని ఆయన చెప్పారు. అంతే కాకుండా భవిష్యత్ లో బీజేపీ చేతులు కలిపి తప్పు చేయాలని భావించడం లేదని ఆయన పేర్కొన్నారు. అబద్ధపు హామీలు, వాగ్దానాలతో దేశ, రాష్ట్ర ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తప్పుదోవ పట్టించారని విమర్శించారు. 

  • Loading...

More Telugu News