: కోర్టుకు వచ్చి వివరణ ఇచ్చుకోండి: కేజ్రీవాల్‌కు ఢిల్లీ న్యాయస్థానం ఆదేశం


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గతంలో ఢిల్లీ క్రికెట్‌ సంఘం ఛైర్మన్‌గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన జైట్లీ ఆయనపై పరువు నష్టం దావా వేసిన సంగతి విదితమే. ఈ దావా కేసులో వివ‌ర‌ణ ఇచ్చేందుకు వ‌చ్చేనెల 21న‌ కోర్టులో హాజ‌రుకావాల‌ని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మ‌రోవైపు డీడీసీఏ ఉపాధ్యక్షుడు చేతన్‌ చౌహాన్‌ కూడా కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేశారు. ప్ర‌స్తుతం కేజ్రీవాల్ బెంగ‌ళూరులో వైద్య చికిత్స చేయించుకుంటున్నారు. నాలుగు రోజుల్లో ఆయ‌న ఢిల్లీకి వ‌స్తారు.

  • Loading...

More Telugu News