: అప్పట్లోనూ తమిళనాడు అసెంబ్లీలో ఇలాగే జరిగింది!


స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లడం, కుర్చీలు విసిరేయడం, నినాదాలతో హోరెత్తించడం.. ఇవ‌న్నీ ఈ రోజు తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప‌ళ‌నిస్వామి బ‌ల‌నిరూప‌ణ ప‌రీక్ష సంద‌ర్భంగా చోటుచేసుకున్న ప‌రిస్థితులు. అయితే, ఇటువంటి ఘ‌ట‌న ఆ రాష్ట్ర అసెంబ్లీలో చోటుచేసుకోవ‌డం మొద‌టి సారేం కాదు. గ‌తంలో ఎంజీఆర్ మృతి చెందిన త‌రువాత జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య పోటీ తలెత్తినప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించిన సంద‌ర్భంగా కూడా ఇటువంటి ప‌రిస్థితులే చోటుచేసుకున్నాయి.

1988 జనవరి 27వ తేదీన అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. అప్పుడు కూడా శాస‌న‌స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం ఏర్ప‌డి స‌భ‌లోనే సభ్యులు కొట్టుకున్నారు. వారిని అదుపు చేసేందుకు తొలిసారి సభలోకి పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. అప్ప‌ట్లో జయలలిత వర్గ ఎమ్మెల్యేల‌కు నెడుంజెళియన్ నాయకత్వం వహించారు. స‌భ‌లో ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణ‌మైన ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌పై అప్ప‌టి స్పీక‌ర్‌ పీహెచ్ పాండియన్.. ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అనర్హత వేటు వేశారు. మ‌రోవైపు ప‌లువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. ఆ ప‌రీక్ష‌లో చివ‌రికి జానకీ రామచంద్రన్ గెలిచారు.

  • Loading...

More Telugu News