: స్టాలిన్ తో చర్చలు జరిపిన స్పీకర్


తమిళనాడు అసెంబ్లీ రణ రంగాన్ని తలపిస్తోంది. పళనిస్వామి విశ్వాస పరీక్ష నేపథ్యంలో సీక్రెట్ ఓటింగ్ కు పట్టుబట్టిన డీఎంకే, పన్నీర్ సెల్వం వర్గ ఎమ్మెల్యేలు సభలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏకంగా స్పీకర్ చొక్కా పట్టి లాగి, ఆయన కుర్చీలో కూడా కూర్చున్నారు. ఈ నేపథ్యంలో, డీఎంకే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్. ఈ క్రమంలో, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ను స్పీకర్ చర్చకు ఆహ్వానించారు. ఈ చర్చ సందర్భంగా కూడా రహస్య ఓటింగ్ జరపాల్సిందేనంటూ స్టాలిన్ పట్టుబట్టారు. దీంతో, ఓటింగ్ ప్రక్రియ మరింత గందరగోళంగా మారింది. 

  • Loading...

More Telugu News