: స్పీకర్ మీదకు కుర్చీలు విసిరేశారు.. చొక్కా పట్టుకుని లాగారు!
పళనిస్వామి బల పరీక్షకు సంబంధించి రహస్య ఓటింగ్ ను నిర్వహించాలన్న డీఎంకే కోరికను స్పీకర్ ధనపాల్ తిరస్కరించారు. దీంతో, డీఎంకే ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోయారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టడమే కాకుండా, స్పీకర్ పైకి కుర్చీలను విసిరారు. స్పీకర్ టేబుల్ పైకి ఎక్కారు. పేపర్లను చింపి, ఆయన మీదకు విసిరేశారు. దీంతో, స్పీకర్ కూడా భయభ్రాంతులకు గురైన్టటు తెలుస్తోంది. దీంతో, ఆయన సభను వాయిదా వేశారు. వెంటనే మార్షల్స్ వచ్చి ఆయనను సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ సమయంలో కూడా స్పీకర్ చొక్కా పట్టుకుని లాగారు డీఎంకే ఎమ్మెల్యేలు.