: సభలో రచ్చ రచ్చ.. ఒంటిగంట వరకు అసెంబ్లీ వాయిదా
తమిళనాడు అసెంబ్లీలో పళనిస్వామి విశ్వాస పరీక్షకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 15 రోజుల గడువు ఉన్నప్పటికీ హడావుడిగా పరీక్షను నిర్వహించడం, సీక్రెట్ ఓటింగ్ కు స్పీకర్ నిరాకరించడం పట్ల డీఎంకే సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేశారు. వీరికి పన్నీర్ సెల్వం వర్గీయులు కూడా తోడయ్యారు. వీరి ఆగ్రహానికి సభలోని మైకులు, బల్లలు విరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ను ఆపేసిన స్పీకర్ తొలుత అరగంట పాటు సభను వాయిదా వేశారు. అయినప్పటికీ సభలో డీఎంకే సభ్యుల బీభత్స కాండ కొనసాగింది. స్పీకర్ మైకును కూడా విరగ్గొట్టారు. ఈ నేపథ్యంలో, ఓటింగ్ చేపట్టడం కష్టమని భావించిన స్పీకర్... సభను ఒంటి గంట వరకు వాయిదా వేశారు. ప్రస్తుతం ఇంత గందరగోళంగా ఉన్న సభ... ఒంటి గంట తర్వాత ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి.