: స్పీకర్ ను సురక్షితంగా సభ నుంచి తీసుకెళ్లిన మార్షల్స్.. స్పీకర్ ఛైర్లో కూర్చున్న డీఎంకే ఎమ్మెల్యే!


ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఈ క్రమంలో, సభను నిర్వహించడం స్పీకర్ కు కష్ట సాధ్యంగా మారింది. సభను నడపడం అటుంచితే, మొదట తనను తాను రక్షించుకోవడం ఆయనకు కష్టమైంది. ఈ నేపథ్యంలో, స్పీకర్ ను సభలోని మార్షల్స్ అక్కడ నుంచి సురక్షితంగా తీసుకెళ్లి, ఆయన ఛాంబర్ కు చేర్చారు. అనంతరం స్పీకర్ ఛైర్ లో డీఎంకే ఎమ్మెల్యే కుప్పుసెల్వం కూర్చున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. సభలో డీఎంకే సభ్యులు ఏ రేంజ్ లో రెచ్చిపోయారో ఈ ఘటన చెబుతోంది. స్పీకర్ కుర్చీలో ఓ సాధారణ సభ్యుడు కూర్చోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినప్పటికే డీఎంకే సభ్యుడు ఇంత తీవ్ర చర్యకు ఒడిగట్టారంటే... డీఎంకే పార్టీ ముందుగానే, పక్కా ప్లాన్ తో వచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News