: వ్యాపారాన్ని బ్యాంకాక్ కు విస్తరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్!
టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్... తన సంపాదనను వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టే పనిలో బిజీగా ఉంది. ఇటీవలే హైదరాబాదులో ఓ ఖరీదైన జిమ్ ను ఈ అమ్మడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన జిమ్ బిజినెస్ ను విస్తరించే పనిలో ఉంది రకుల్. బ్యాంకాక్ లో కూడా ఓ ఖరీదైన జిమ్ ను ప్రారంభించే యోచనలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ లతో బిజీబిజీగా ఉన్న రకుల్... కొంచెం వీలు చూసుకుని బ్యాంకాక్ పనిపై దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ జిమ్ వ్యాపారాన్ని రకుల్ సోదరుడు చూసుకుంటున్నాడు.