: ఓటింగ్ ఎలా నిర్వహించాలో నాకు తెలుసు.. జోక్యం చేసుకోవద్దు: అసెంబ్లీ స్పీకర్


తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండు రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి ఆ రాష్ట్ర‌ అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ ప‌రీక్ష ఎదుర్కుంటున్న నేప‌థ్యంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఆరు బ్లాక్‌లుగా విభ‌జించి కొన‌సాగుతున్న ఈ ఓటింగ్‌ను స్పీక‌ర్ ధ‌న్‌పాల్ ముందుకు తీసుకెళుతున్నారు. డీఎంకే నేత‌లు స‌భ‌ను వాయిదా వేయాల‌ని డిమాండ్ చేస్తోన్న నేప‌థ్యంలో స్పీక‌ర్ ఆ అంశంపై స్పందిస్తూ స‌భ‌ను రేపటికి వాయిదా వేసే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్పారు.

ఈ రోజే ఓటింగ్ జరుగుతుందని, దానికి అందరూ స‌హ‌క‌రించాలని న‌చ్చ‌జెబుతూ మొద‌టి డివిజ‌న్ కౌంటింగును పూర్తి చేసి, రెండో డివిజ‌న్ లెక్కింపును ముందుకు తీసుకువెళ్ల‌డం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల మ‌ధ్య‌లో త‌ల‌దూర్చకూడ‌ద‌ని స్పీకర్ గ‌ట్టిగా చెప్పారు. ఎలా ఓటింగ్ ప్ర‌క్రియ జ‌ర‌పాలో త‌న‌కు తెలుస‌ని అన్నారు. కాంగ్రెస్ కూడా ర‌హ‌స్య ఓటింగ్ కోస‌మే ప‌ట్టుబ‌డుతోంది. ప్ర‌జాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జ‌ర‌గ‌డం లేద‌ని వారు నినాదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News