: అసెంబ్లీ వద్దకు చేరుకున్న పళని, పన్నీర్ ఎమ్మెల్యేలు.. పాదయాత్రగా వచ్చిన డీఎంకే సభ్యులు
మరికాసేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష ఎదుర్కుంటుండడంతో ఆయన గెలుస్తారా? లేదా? అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారీ భద్రత నడుమ పళనిస్వామి వర్గ ఎమ్మెల్యేలు, పన్నీర్ వర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. మరోవైపు స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే ఎమ్మెల్యేలు 88 మంది పాదయాత్రగా అక్కడకు వచ్చారు. అలాగే కాంగ్రెస్, ముస్లింలీగ్ శాసనసభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. మరికాసేపట్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలందరూ ఆయనకే ఓటు వేస్తారా? అన్న అంశంపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది.