: ఈపీఎఫ్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు
ఈపీఎఫ్-ఆధార్ అనుసంధానం గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28 వరకు ఉన్న గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఈపీఎఫ్వో ప్రకటించింది. జనవరిలో ప్రవేశపెట్టిన నూతన విధానం ప్రకారం ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పొందాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఇందుకోసం ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ గడువును మరో నెలరోజుల పాటు పెంచింది. అలాగే డిజిటల్ జీవన ప్రమాణ పత్రం(లైఫ్ సర్టిఫికెట్)ను సమర్పించాల్సిన గడువును కూడా వచ్చే నెల 31 వరకు పెంచింది. గతంలో ఈ సర్టిఫికెట్ను పింఛన్దారులు బ్యాంకుకు వెళ్లి అందించాల్సి వచ్చేది. ఇప్పుడు జీవన్ ప్రమాణ్ సాఫ్ట్వేర్ ద్వారా మొబైల్ ఫోన్ల నుంచి కూడా సమర్పించవచ్చని పేర్కొంది. బ్యాంకుల వద్ద ఏర్పాటు చేసిన కామన్ కస్టమర్ కేర్ సెంటర్లలో ఈ సర్టిఫికెట్లను అందించవచ్చని అధికారులు తెలిపారు.