: పన్నీర్ సెల్వం పిలుపుకు స్పందిస్తున్న యువత.. మెరీనాబీచ్ పరిసరాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత!
చెన్నై మెరీనాబీచ్‌లో ఇటీవల జరిగిన జల్లికట్టు ఉద్యమం కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడు సీఎంగా పళనిస్వామి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా అటువంటి పరిస్థితులే కనిపించాయి. పన్నీరుసెల్వానికి మద్దతుగా జల్లికట్లు తరహా ఉద్యమానికి సోషల్ మీడియాలో పలువురు పోస్ట్‌లు పెట్టిన ప్రభావంతో అక్కడకు పెద్ద ఎత్తున యువకులు చేరుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా మెరీనాబీచ్ వద్ద భారీగా మోహరించారు. మెరీనా బీచ్‌వైపు వస్తున్న యువతను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఆ పరిసరాల్లో మరోసారి అలజడి రేగింది.