: శశికళను కలిసేందుకు ప్రయత్నించిన భర్త నటరాజన్!
అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నశశికళను కలిసేందుకు ఆమె భర్త నటరాజన్ నిన్న ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని తెలుస్తోంది. శశికళను కలిసేందుకు జైలు అధికారులు ఆయనను అనుమతించలేదని సమాచారం. అయితే, శశికళ తరపు లాయర్ మాత్రం ఆమెను కలిశారని, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారని తెలుస్తోంది. అనంతరం, నటరాజన్, కుటుంబ సభ్యులు తిరిగి చెన్నై చేరుకున్నారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు మేరకు రెండు రోజుల క్రితం కోర్టులో లొంగిపోయిన శశికళ, పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.