: తెనాలిలో కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు


తెలంగాణ సీఎం కేసీఆర్ 63వ పడిలోకి ఈరోజు అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా, పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గుంటూరు జిల్లా తెనాలిలోనూ కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ అభిమాన సంఘం నేత ఖాదీర్ ఆధ్వర్యంలో స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేశారు. వృద్ధులకు స్వీట్లు పంపిణీ అనంతరం, అన్నదానం చేశారు. 

  • Loading...

More Telugu News