: బీజేపీ ఎంపీ మనోజ్ తివారి కారుపై రాళ్లు రువ్విన దుండగులు


ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారికి చేదు అనుభ‌వం ఎదురైంది. ముంబైలోని త‌న నివాసం నుంచి కారులో బయటకు వెళ్తుండగా దానిపై ప‌లువురు దుండ‌గులు రాళ్లు విసిరారు. దీంతో ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. నగర కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ఆయన ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తమ ప్రత్యర్థి పార్టీ నేతలే దాడి చేశారని ఆయ‌న అన్నారు. ఇలాంటి చర్యలకు తాను భయపడబోనని ఉద్ఘాటించారు. త‌న‌కు ముంబైలో ఇల్లు ఉందని, తాను అక్కడే ఉంటున్నానని అన్నారు. త‌న‌కు అక్క‌డి ప్రజల మద్దతు ఉందని, త‌న‌పై ఆ దాడికి కార‌ణం త‌మ‌ ప్రత్యర్థి పార్టీ అయి ఉంటుంద‌ని చెప్పారు. త‌న‌పై జ‌రిగిన ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని మీడియాకు తెలిపారు. పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించార‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News