: గ్రేమ్ స్మిత్ మీద నాకున్న అభిప్రాయం చాలా గొప్పది: సచిన్ టెండూల్కర్


తాను క్రికెట్ ఆడిన సమయంలో, తాను చూసిన గొప్ప కెప్టెన్లలో దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఒకడని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపారు. తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకంలో ఈ విషయాన్ని సచిన్ పేర్కొన్నాడు. 22 ఏళ్ల వయసులో సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ సారథ్య బాధ్యతలను స్మిత్ చేపట్టాడని... ఆ తర్వాత ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన టీమ్ ను అగ్రగామిగా నిలిపాడని కొనియాడాడు. స్మిత్ కెప్టెన్ అయిన సమయంలో సౌతాఫ్రికా టీమ్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని... అలాంటి స్థితి నుంచి టీమ్ ను విజయాల బాట పట్టించాడని తెలిపాడు. స్మిత్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా అనేక ఘన విజయాలను సాధించిందని కితాబిచ్చాడు. 

  • Loading...

More Telugu News