: టీడీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ప్రారంభం.. హాజరైన చంద్రబాబు, లోకేష్


విజయవాడలో టీడీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ప్రారంభమయింది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించి కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ కు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సంతృప్తికరంగా జీవించేలా పాలన కొనసాగించాలని అన్నారు. టీడీపీ పాలనలో అవినీతికి తావు లేదని... అవినీతిని ఎక్కడికక్కడ తొక్కేస్తున్నామని తెలిపారు. పార్టీకి కార్యకర్తలే బలమని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. గత 35 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, కార్యకర్తల అండతో సమస్యలను అధిగమించామని తెలిపారు. 

  • Loading...

More Telugu News