: శిఖర్ పరుగుల షికారు.. ముంబయి బేజారు


అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ విజయాలబాట పట్టింది. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి బ్యాట్ కు పనిచెప్పడంతో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ధావన్ కేవలం 55 బంతుల్లోనే అజేయంగా 73 పరుగులు చేశాడు. వాటిలో 9 ఫోర్లు ఓ సిక్స్ ఉన్నాయి. ముంబయి విసిరిన 130 పరుగుల లక్ష్య ఛేదనలో ధావన్ కు కెప్టెన్ సంగక్కర (21), యువ బ్యాట్స్ మన్ హనుమ విహారి (25) సహకరించారు. అయితే, ఈ విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి ఎగబాకాలని భావించిన హైదరాబాద్ అందుకు అవసరమైన నెట్ రన్ రేట్ సాధించడంలో విఫలమైంది. దీంతో, ముంబయి తర్వాత ఐదోస్థానంతోనే సరిపెట్టుకుంది.

  • Loading...

More Telugu News