: 104 కాదు... 400 ఉపగ్రహాలైనా ప్రయోగించగల సత్తా భారత్ సొంతం: మాధవన్ నాయర్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు ఒకేసారి 400 నానో ఉపగ్రహాలను ప్రయోగించి, విజయవంతంగా వాటిని కక్ష్యలో పెట్టగల సత్తా ఉందని ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్ అభిప్రాయపడ్డారు. నిన్న 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే పరిజ్ఞానం ఈనాటిది కాదని, తాము తొలుత 10 ఉపగ్రహాలతో మొదలు పెట్టామని గుర్తు చేశారు. ఆపై 18, 35, 100 ఇలా సాగుతూ వస్తున్నామని, ఒక్కొక్కటీ మూడు నుంచి నాలుగు కేజీల బరువైన ఉపగ్రహాలైతే పీఎస్ఎల్వీ రాకెట్ 400 వరకూ తీసుకెళుతుందని వెల్లడించారు.