: అంతలోనే మారిపోయిన శశికళ 'ఖైదీ నంబర్'!
జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత నిన్న బెంగళూరుకు సమీపంలోని పరప్పణ అగ్రహారంలో శశికళ సహా ఇతర నిందితులు లొంగిపోయిన వేళ, తొలుత శశికళకు 10711, ఇళవరసికి 10712, సుధాకరన్ లకు 10713 నంబర్లను కేటాయించిన జైలు అధికారులు, ఆపై తమ నిర్ణయం మార్చుకున్నారు. కారణం అధికారికంగా తెలియ రాలేదుగానీ, ఆమె జైల్లోకి వెళ్లిన కాసేపటికి ఈ నంబర్లను 9234, 9235, 9236గా మార్చినట్టు ప్రకటన వెలువడింది. కాగా, సీరియల్ నంబర్ ప్రకారం, 10711 నుంచి నంబర్లను కేటాయించాల్సి వుందని, అయితే, కొందరు ఖైదీలు విడుదల కావడంతో ఖాళీలు ఉండటం, మరో మూడున్నరేళ్లు వీళ్లు జైల్లోనే ఉండాల్సి రావడంతోనే ఖాళీ అయిన ఆ నంబర్లను వీరికి కేటాయించినట్టు అనధికార వర్గాల సమాచారం.