: డొనాల్డ్ ట్రంప్ కు షాకిచ్చిన రష్యా!
వివాదాస్పద క్రిమియా వ్యవహారంలో రష్యా ప్రభుత్వం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాకిచ్చింది. క్రిమియాను ఉక్రెయిన్ కు ఇవ్వాలని ట్రంప్ చేసిన సూచనపై మండిపడింది. క్రిమియా తమ భూభాగమని, దీన్ని ఎవరికీ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. తమ భూ భాగాల విషయంలో కల్పించుకోవడాన్ని మానుకోవాలని హితవు పలికింది. తమకు ఎవరి సలహాలూ అక్కర్లేదని, లేనిపోని సమస్యలను సృష్టించే వ్యాఖ్యలు చేయవద్దని ట్రంప్ ను ఉద్దేశించి రష్యా స్పష్టం చేసింది. కాగా, క్రిమియాను ఉక్రెయిన్ కు ఇచ్చి వేయడం ద్వారా, అక్కడ జరుగుతున్న హింసకు ముగింపు పలకవచ్చని ట్రంప్ సలహా ఇచ్చారు. దీనికి అంగీకరించే సమస్యే లేదని రష్యా పేర్కొనడంతో ఉక్రెయిన్ వార్ ఇప్పట్లో ఆగదని స్పష్టమవుతోంది.