: గవర్నర్ జాప్యం చేయకూడదు... మాకే అవకాశం ఇవ్వాలి: పళనిస్వామి


తమిళనాడు రాజకీయాలు క్లైమాక్సుకు చేరుకున్నాయి. రాజ్ భవన్ లో గవర్నర్ సీహెచ్.విద్యాసాగరరావుతో సమావేశం అనంతరం అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిస్వామి మాట్లాడుతూ, తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అన్నారు. అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందువల్ల ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ తమనే ఆహ్వానించాలని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు గవర్నర్ నుంచి వర్తమానం అందుతుందని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ, పన్నీర్ సెల్వం తన మద్దతుదారు ఎమ్మెల్యేల సంఖ్య బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పన్నీర్ సెల్వంకు ఎవరూ మద్దతు తెలపడం లేదని ఆయన చెప్పారు. గవర్నర్ జాప్యం చేయకుండా తమను ఆహ్వానించాలని ఆయన డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News