: ప్రధాని మోదీ, వెంకయ్యనాయుడుతో తంబిదురై భేటీ


ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో అన్నాడీఎంకే ఎంపీ, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై భేటీ అయ్యారు. శశికళ బెంగళూరు బయల్దేరిన వెంటనే తంబిదురై హస్తినకు బయల్దేరారు. ఢిల్లీ చేరుకుని ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకుని, ఆయనతో భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునివ్వాలని కోరారు. అనంతరం వెంకయ్యనాయుడును కలిసి, ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించారు. ఎమ్మెల్యేలను సంఘటితపరిచి తమిళనాడులో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన తంబిదురైకి సూచించారు.  

  • Loading...

More Telugu News