: మీరు తెలిపిన అభినందనలు నాకు ప్రపంచంతో సమానం: సచిన్ కు కోహ్లీ సమాధానం


భీకరమైన ఫాంలో ఉన్న విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా కోహ్లీని అభినందించాడు. ఈ మేరకు ట్వీట్ చేసిన సచిన్... 'నీ బ్యాట్, అందులోని స్వీట్ స్పాట్, నువ్వు ఎంత గొప్ప ఫాంలో ఉన్నావో చాటి చెబుతాయి. దానిని నిర్ధారించేందుకు ఏ స్కోరు బోర్డులు అవసరం లేదు. నీ బ్యాట్ ను దేవుడు ఇలాగే సురక్షితంగా ఉంచాలి' అంటూ సచిన్ కోహ్లీని అభినందించాడు. దీనికి సమాధానమిచ్చిన కోహ్లీ, 'ధన్యవాదాలు సచిన్... మీ ఆశీర్వాదాలు నాకు ప్రపంచంతో సమానం' అని పేర్కొన్నాడు. కాగా, తనకు సచినే ఆదర్శమని కోహ్లీ చెబుతుంటాడన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News