: ఎమ్మెల్యేల సంతకాలతో మరోసారి గవర్నర్ కు లేఖ అందజేసిన పళనిస్వామి
తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు నేటి సాయంత్రానికి రాష్ట్రంలో పాలనపై నిర్ణయం తీసుకోనున్నారంటూ వార్తలు ప్రసారమవుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే కొత్త శాసనసభాపక్ష నేత పళనిస్వామి మరోసారి గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా మళ్లీ తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు ఆయన అందజేశారు. దీంతో ఆయనను అధికారం చేపట్టేందుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రాజ్ భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. మరికాసేపట్లో దీనిపై స్పష్టత రానుందని సమాచారం.