: హోసూరు దాటిన శశికళ...కాసేపట్లో జైలుకు!
కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలుకు కాసేపట్లో తమిళనాడు అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ చేరుకోనున్నారు. చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన ఆమె ప్రస్తుతం హోసూరు దాటారు. కాసేపట్లో బెంగళూరు చేరుకోనున్నారు. ఇప్పటికే ఆమె భర్త నటరాజన్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై విమానంలో బయలుదేరి వెళ్లి, పరప్పన అగ్రహార కోర్టుహోలు వద్దకు చేరుకున్నారు. శశికళ చేరుకోనున్న నేపథ్యంలో జైలులోనే కోర్టు హాలును ఏర్పాటు చేశారు. అంతే కాకుండా జైలు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు.