: శ‌శిక‌ళ లాంటి వారు మ‌న రాష్ట్రంలోనూ ఉన్నారు: ముఖ్యమంత్రి చ‌ంద్ర‌బాబు


కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగ‌ల్రాయుడు ఈ రోజు ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడి స‌మ‌క్షంలో ఆ పార్టీ  కండువా క‌ప్పుకున్న  విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. త‌మిళ‌నాడు రాజ‌కీయ సంక్షోభంపై స్పందించారు. త‌ప్పు చేసిన వారు చ‌ట్టం నుంచి ఎన్న‌టికీ త‌ప్పించుకోలేర‌ని అన్నారు. శ‌శికళ న‌ట‌రాజ‌న్‌ లాంటి వారు మ‌న రాష్ట్రంలోనూ ఉన్నారని చ‌ంద్ర‌బాబు నాయుడు అన్నారు. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండవలసిన అవసరం ఉందా? అని ప్ర‌శ్నించారు. మ‌న రాష్ట్రంలో అక్ర‌మార్కులు శ‌శిక‌ళ కాజేసిన దానిక‌న్నా ఎక్కువ‌గా న‌ల్ల‌ధ‌నాన్ని క‌లిగి ఉన్నార‌ని చెప్పారు. రాజ‌కీయాల్లో అవినీతిపై సుప్రీంకోర్టు కూడా విచారం వ్య‌క్తం చేసింద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News