: రాష్ట్రపతికి లేఖ రాసిన రానా


ప్రముఖ నటుడు రానా  రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. రానా రాజకీయాల్లోకి వస్తున్నాడా? అనే అనుమానం వద్దు...రానా 'అర్జున్ వర్మ' పాత్రలో నటించిన 'ఘాజీ' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఘాజీ గురించిన పలు విషయాలు రానా తెలుసుకున్నాడు. అంతే కాకుండా ఆనాటి పరిస్థితులు, మనోభావాలు తెలుసుకునేందుకు పలువురు నేవీ అధికారులను కలిశాడు. ఈ క్రమంలో వారి గురించి ప్రపంచానికి తెలియజేయాలని తపిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రాష్ట్రపతికి లేఖరాసిన రానా...అందులో...ఘాజి సినిమా అనంతరం సరిహద్దు భద్రత కోసం సైనికులు యుద్ధాల్లో పోరాడి సాధించిన విజయం గురించి తనలాంటి ఎందరో పౌరులు తెలుసుకోగలిగారని చెప్పాడు. ఓ సామాన్య పౌరుడిగా తనకు ఈ యుద్ధాల గురించి తెలియదని చెప్పిన రానా, తనలాంటి వారు సమాజంలో ఎందరో ఉన్నారని గుర్తుచేశాడు. అందుకే ఘాజీ వంటి జలాంతర్గాముల్లో పని చేసే రియల్ హీరోల గురించి ప్రపంచానికి, కనీసం దేశీయులకు తెలియాల్సిన అవసరం ఉందని, వారి గురించి దేశానికి తెలియచెప్పాల్సిన బాధ్యత ఉందని, వారి గొప్పతనం వివరించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని త్రివిధదళాధిపతి రాష్ట్రపతి ప్రణబ్ ను లేఖలో కోరాడు. 

  • Loading...

More Telugu News