: ఇద్దరు పాక్ క్రికెటర్లను అరెస్ట్ చేసిన బ్రిటన్ పోలీసులు


పాకిస్థాన్ క్రికెటర్లు నాసిర్ జంషెడ్, యూసుఫ్ లను బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 13న వీరిని అరెస్ట్ చేసినట్టు బ్రిటన్ జాతీయ క్రైమ్ అథారిటీ అధికారులు తెలిపారు. అయితే, ఏప్రిల్ వరకు గడువును ఇస్తూ బెయిల్ మంజూరు చేసినట్టు వెల్లడించారు. ఇటు పాకిస్థాన్ లో కూడా పాక్ సూపర్ లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో షర్జిల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ లను సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా పాక్ క్రికెట్ లీగ్ ఛైర్మన్ నజీమ్ సెతీ మాట్లాడుతూ, ఫిక్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

  • Loading...

More Telugu News