: మద్దతివ్వకపోతే చంపుతామన్నారు.. రక్షణ కల్పించండి: డీజీపీకి ఫిర్యాదు చేసిన శరవణన్
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పళనిస్వామిలపై ఎమ్మెల్యే శరవణన్ తీవ్ర ఆరోపణలు చేశారు. శశికళకు మద్దతు ఇవ్వాలంటూ తనను బెదిరించారని ఆయన తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. మద్దతు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో, తనకు ప్రాణహాని ఉందని... రక్షణ కల్పించాలని డీజీపీని కోరారు. తనను కిడ్నాప్ చేసి, రిసార్ట్ కు తరలించారని చెప్పారు. తననే కాకుండా, చాలా మంది ఎమ్మెల్యేలను శశికళ వర్గం బెదిరించిందని తెలిపారు. ఆమె వర్గం నుంచి బయటకు రావడానికి ఇప్పటికీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని అన్నారు. మరోవైపు శశివర్గం నుంచి బయటపడ్డ శరవణన్... నేరుగా పన్నీర్ సెల్వం వద్దకు వెళ్లి, ఆయనకు మద్దతు తెలిపారు.