: జైలుకు వెళ్లినా ఆగని నెటిజన్లు... శశిపై కొనసాగుతున్న తిట్ల వర్షం


సగటు తమిళ తంబీలు శశికళపై ఇంకా కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తున్న జనాగ్రహం, శశికళ జైలుకు బయలుదేరిన తరువాత సైతం ఏ మాత్రం చల్లారకపోగా, సమాధిపై ఆమె బలంగా కొట్టడాన్ని సైతం ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకూ ఎవరివైపూ లేని వారు కూడా ఇప్పుడు శశికళపై ఆగ్రహంతో పోస్టులు పెడుతున్నట్టు తెలుస్తోంది. సమాధి వద్ద నమస్కారం చేసుకోవచ్చుగానీ, చేత్తో కొట్టడం ఏంటని కొందరు అడుగుతున్నారు.

అమ్మ ఆసుపత్రిలో ఉన్న వేళ, జాతీయ నేతలకు సైతం అమ్మను చూపించలేదని, అందుకు శశికళే కారణమని ఆరోపిస్తున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందన్న వైద్యుల సలహా నిజమైతే, శశికళను ఎందుకు పక్కనే ఉండనిచ్చారని అడుగుతున్నారు. నర్సులు పట్టుకున్నా ఇన్ఫెక్షన్ సోకుతుందని చెబుతూ, ఫిజియో థెరపీకి సైతం రోబోలను వాడిన వైద్యులు, శశిని అదే గదిలో ఎలా ఉంచారని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద శశికళ జైలుకు బయలుదేరి వెళ్లినా ఆమెపై కురుస్తున్న విమర్శల వర్షం మాత్రం ఆగలేదు.

  • Loading...

More Telugu News