: అమ్మ సమాధి ముందు శశికళ చేసిన మూడు శపథాలు!
బెంగళూరుకు బయలుదేరే ముందు అమ్మ సమాధిని దర్శించుకున్న శశికళ, అక్కడ సమాధిపై మూడు సార్లు బలంగా కొట్టి, మూడు శపథాలు చేసిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఏం చెబుతూ మూడు సార్లు సమాధిపై కొట్టిందన్న విషయాన్ని ఆ సమయంలో పక్కనే ఉన్న అన్నాడీఎంకే నేతలు వివరించారు. ఎక్కడున్నా తన మనసు అమ్మ చుట్టూనే ఉంటుందని, దానిలో మార్పుండదని చెబుతూ ఆమె తొలిసారి సమాధిపై కొట్టారని ఓ నేత తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆశయాలను కొనసాగిస్తానని ఓ సారి, పార్టీని చీల్చాలని చూసేవారిని ఎన్నటికీ క్షమించనని ఎరుపెక్కిన కళ్లతో మరోసారి ఆమె సమాధిపై కొట్టారని వెల్లడించారు.