: జయలలితకు నివాళి అర్పించిన శశికళ.. సమాధిపై మూడు సార్లు చేత్తో కొట్టి శపథం చేసిన శశి
బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో లొంగిపోవడానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పోయస్ గార్డెన్ నుంచి బయల్దేరారు. ఈ సందర్భంగా మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత సమాధిని ఆమె దర్శించుకున్నారు. సమాధిపై పూలు చల్లి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టారు. అనంతరం సమాధి చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం తన తలను సమాధికి ఆనించి, జయను స్మరించుకున్నారు. అమ్మ ఆశయ సాధన కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ శపథం చేసిన ఆమె... సమాధిపై మూడు సార్లు చేత్తో కొట్టారు. వెంటనే కారులో అక్కడ నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో బయలు దేరారు. ఈ సందర్భంగా ఆమె వెంట భారీ సంఖ్యలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు జయ సమాధి వద్దకు వచ్చారు.