: 'తక్షణం' అంటే ఏంటో తెలుసా?.. శశికళ న్యాయవాదిపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు జడ్జి
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాను లొంగిపోవడానికి గడువు కావాలంటూ సుప్రీంకోర్టును శశికళ కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన జడ్జి... ఆమె తరపు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్మీడియట్లీ (తక్షణం) అనే పదానికి మీకు అర్థం తెలుసా? అంటూ సీరియస్ అయ్యారు.
దీంతో, నివ్వెర పోయిన సదరు లాయర్... శశికళకు అనారోగ్య సమస్యలున్నాయని, అందుకే గడువు కోరారని చెప్పారు. దీనికి సమాధానంగా సుప్రీం తీర్పులో ఎలాంటి మార్పులు ఉండవని... శశికళ వెంటనే లొంగిపోవాల్సిందే అని జడ్జి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, శశికళ తానంతట తాను లొంగిపోకపోతే... ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి, బెంగళూరుకు తరలిస్తారు.