: బీమా డబ్బు కోసం దత్తపుత్రుడి ప్రాణం తీసిన దంపతులు


గుజరాత్‌లోని జునాఘడ్‌ జిల్లా కెశోద్‌ ప్రాంతంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బీమా డ‌బ్బు కోసం దత్తపుత్రుడిని చంపించారు ఓ దంప‌తులు. లండన్‌లో నివ‌సిస్తోన్న ఆర్తీ లోక్‌నాథ్‌(53), కన్వాల్జిసిన్హ్‌ రాయిజాదా(28) దంపతులకి గోపాల్‌(13) అనే ద‌త్త‌పుత్రుడు ఉన్నాడు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉంటున్న ఆ బాలుడి పేరిట రూ.కోటి 20లక్షల బీమా ఉంది. అయితే, ఆ బాలుడిని చంపేసి ఆ డ‌బ్బుని కొట్టేయాల‌ని ఆ దంప‌తులు భావించి ప్లాన్ వేసుకున్నారు. అందుకోసం నితీశ్‌ ముండే అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని త‌మ ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేశారు.

లండన్‌లో ఉన్న నితీశ్ గుజరాత్‌కు వచ్చి 2015లో తన దత్తపుత్రుడిని హతమార్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏ సాక్ష్యాలు లేకుండా గోపాల్‌ను చంపేందుకు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఆఖ‌రికి ఈ ఏడాది ఫిబ్రవరి 8న జునాఘడ్‌ జిల్లాలోని కెశోద్‌ ప్రాంతంలో గోపాల్ పై దాడి చేయించాడు. ఇద్ద‌రు దుండ‌గులు ఆ బాలుడిని క‌త్తుల‌తో పొడిచి పారిపోయారు. తీవ్ర గాయాల పాల‌యిన ఆ బాలుడు వారం రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌ర‌ప‌గా ఆ బాలుడిని ద‌త్త‌త తీసుకున్న‌ లోక్‌నాథే ఈ హ‌త్య చేయించిన‌ట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News