: జయహో ఇస్రో... మన శాస్త్రవేత్తలకు భారత్ సెల్యూట్ చేస్తోంది: మోదీ ప్రశంసలు
శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-37 రాకెట్ విజయవంతంగా 104 ఉపగ్రహాలనూ వాటి కక్ష్యల్లో ప్రవేశపెట్టడంతో దేశంలోని ప్రముఖులు ‘జయహో ఇస్రో’ అంటూ మన శాస్త్రజ్ఞుల ఘనతను పొగుడుతున్నారు. పీఎస్ఎల్వీ సీ-37 రాకెట్ విజయం సాధించడమే ఆలస్యం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశాలు ఒకేసారి ప్రవేశపెట్టనన్ని ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టడంతో ఆయన ఇస్రోకి అభినందనలు తెలిపారు. చరిత్రలో గుర్తుండిపోయే ఈ ప్రయోగం ఇస్రో సాధించిన మరో అద్భుత విజయమని ఆయన అన్నారు. భారతావని మన శాస్త్రజ్ఞులకు సెల్యూట్ చేస్తోందని మోదీ పేర్కొన్నారు.
This remarkable feat by @isro is yet another proud moment for our space scientific community and the nation. India salutes our scientists.
— Narendra Modi (@narendramodi) 15 February 2017