: గౌరవ డాక్టరేట్ వద్దనడానికి కారణం మా అమ్మ, నా భార్య: వెల్లడించిన రాహుల్ ద్రవిడ్


బెంగళూరు యూనివర్సిటీ అందజేస్తామన్న గౌరవ డాక్టర్ రేట్ ను తిరస్కరించడానికి గతంలోనే కారణం చెప్పిన రాహుల్ ద్రవిడ్ దానికి కాస్త వివరణ ఇచ్చాడు. ఆసీస్ తో త్వరలో ఇండియా-ఏ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ, తన తల్లి పీహెచ్డీ చేసి 55 ఏళ్ల వయసులో డాక్టరేట్‌ పొందారని తెలిపారు. అలాగే తన భార్య శస్త్ర చికిత్స వైద్యురాలని గుర్తు చేసిన ద్రవిడ్...ఆమె సర్జరీ విభాగంలో ఏడేళ్ల పాటు అధ్యయనం చేసి పీహెచ్డీ డిగ్రీ సంపాదించారని చెప్పారు. తాను కూడా క్రీడా రంగంలో విభిన్నంగా పరిశోధన చేసి, పీహెచ్డీ పూర్తి చేయాలని భావిస్తున్నానని స్పష్టం చేశాడు. అందుకే తాను గౌరవ డాక్టరేట్ వద్దన్నానని తెలిపాడు. అలాగని ఇతర పద్ధతుల్లో డాక్టరేట్ పొందినవారిని తక్కువ చేసి మాట్లడడం లేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. అధ్యయనాలు, పరిశోధనల ద్వారా ఆ డిగ్రీ సాధిస్తేనే సరైన అర్థం ఉంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ద్రవిడ్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News