: నేను గవర్నర్ గా ఉన్నా, నాకూ అదే పరిస్థితి వచ్చేది: రోశయ్య
తమిళనాడులో తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ గవర్నర్ రోశయ్య తనదైన శైలిలో స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకవేళ, తమిళనాడులో తాను గవర్నర్ గా ఉన్నా, తనకు కూడా అదే పరిస్థితి వచ్చేదని అన్నారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభాలు సహజమేనని, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావుకు క్లిష్ట సమయమేనని, గవర్నర్ తీరుపై తాను ఏ కామెంట్ చేయనని అంటూ రోశయ్య తనదైన శైలిలో చెప్పారు. కాగా, గతంలో ఇదే అంశంపై రోశయ్య మాట్లాడుతూ, తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని సాధారణ వ్యక్తుల్లానే తానూ ఆసక్తిగా గమనిస్తున్నానని, ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దామని రోశయ్య చెప్పారు.