: వైఎస్సార్సీపీలో చేరనున్న గంగుల ప్రభాకర్ రెడ్డి?


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఇంఛార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో కార్యకర్తలతో ఆయన ఈ రోజు భేటీ అయ్యారు. పార్టీ మారే విషయమై తన అనుచరులు, ముఖ్య నేతలతో చర్చించారని, తన భవిష్యత్ కార్యాచరణపై కూడా గంగుల ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 15న లేదా 18వ తేదీన వైఎస్సార్సీపీ లో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. అయితే, మార్కెట్ యార్డు చైర్మన్ పదవితో పాటు, తన వర్గీయులకు పింఛన్లు, రేషన్ కార్డులు దక్కలేదనే అసంతృప్తితో గంగుల ఉన్నారని సమాచారం.
 

  • Loading...

More Telugu News