: ఇంట్లో నుంచి బయటకు రావద్దు: పన్నీర్ సెల్వంకు పోలీసుల హెచ్చరిక
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నటరాజన్ కు సుప్రీంకోర్టు నాలుగేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శశకళ మద్దతుదారులు, అనుచరులు పన్నీర్ సెల్వంపై దాడి చేస్తారన్న సమాచారంతో ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్ర స్పందించి పన్నీర్ కి పలు సూచనలు చేశారు. ఇప్పటికే పన్నీర్ సెల్వం ఇంటి నుంచి పోలీసు బలగాలను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు రావద్దని పన్నీర్ సెల్వంకు డీజీపీ సూచించారు. ఈ రోజు పన్నీర్ సెల్వం సచివాలయానికి వెళ్లాల్సి ఉంది. డీజీపీ చేసిన సూచనల నేపథ్యంలోనే ఆయన అక్కడకు వెళ్లలేదని తెలుస్తోంది.