: ఆస్కార్ నామినేటెడ్ సినిమాను విమర్శించి అల్లరిపాలైన రిషి కపూర్
ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. సమకాలీన అంశాలపై ఆయన వేగంగా స్పందిస్తారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ నామినేషన్ల బరిలో నిలిచిన 'లా లా ల్యాండ్' సినిమాను విమర్శించారు. 'లా లా ల్యాండ్' సినిమా ఆస్కార్ బరిలో ఎలా నిలిచిందో అర్థం కాలేదని అన్నారు. సినిమా ప్రారంభమైన అరగంటకే తాను ధియేటర్ నుంచి వెళ్లిపోయానని ఆయన ట్వీట్ చేశారు. కాగా, 'లా లా ల్యాండ్' సినిమా 'ఆస్కార్'తో పాటు 'బాఫ్టా' అవార్డు రేసులో కూడా నిలిచింది. దీంతో నెటిజన్లు ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. అది మీలాంటివారికి అర్థం కాదని అన్నారు. అసలు ఆయన ఎలా నటుడయ్యాడో? అంటూ పలువురు నెటిజన్లు విరుచుకుపడ్డారు.