: పళనిస్వామికి గవర్నర్ నుంచి అపాయింట్ మెంట్.. 10 మంది మంత్రులతో వెళ్లనున్న శాసనసభ పక్ష నేత
జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న శశికళ నటరాజన్‌కు నాలుగేళ్ల శిక్షను విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఈ రోజు ఉదయం అన్నాడీఎంకే మంత్రి పళనిస్వామిని.. ఆమె శాసనసభ పక్ష నేతగా నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ ఇప్పటికే గవర్నర్ విద్యాసాగర్ రావుకి శశికళ ఫ్యాక్స్ పంపించగా, పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. దీంతో ఆయనకు గవర్నర్ నుంచి అపాయింట్ మెంట్ లభించింది. ఈ రోజు సాయంత్రం రాజ్‌భవన్‌కు రమ్మని పిలుపు వచ్చింది. గవర్నర్ వద్దకు ఈ రోజు సాయంత్రం పళనిస్వామి 10 మంది మంత్రులతో కలిసి వెళ్లనున్నారు.