: బీజేపీ కోసం టీడీపీ మరో త్యాగం... పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కేటాయింపు


ఏపీలో బీజేపీ కోసం టీడీపీ మరో త్యాగం చేసింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి టీడీపీ కేటాయించింది. అమరావతిలో ఈరోజు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం టీడీపీ శ్రేణులు కృషి చేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో జరగబోయే అన్ని ఎన్నికల కోసం సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదే సమావేశంలో, అసెంబ్లీ స్పీకర్ కోడెల వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారనే అంశం చర్చకు వచ్చింది. స్పీకర్ మాటలను వక్రీకరించడం... అసెంబ్లీని అవమానించడమే అవుతుందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు అధికారుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News