: శశికళకు మరో షాక్ ఇస్తూ... పన్నీర్ వద్దకు వచ్చేసిన మరో ఎమ్మెల్యే
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో నిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఇక ఆమెకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించాక ఇప్పటికే ఆయనకు ఎమ్మెల్యే చిన్నరాజ్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పన్నీర్ వర్గంలో తాను కూడా చేరుతున్నట్లు ఎమ్మెల్యే నటరాజ్ ప్రకటించారు. దీంతో ఆయనకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రంలోపు పన్నీర్ వర్గంలోకి భారీగా ఎమ్మెల్యేలు చేరుకుంటారని అందరూ భావిస్తున్నారు.