: తమిళ రాజకీయ డ్రామాకు తెర... పన్నీర్ ను బల నిరూపణకు ఆహ్వానించనున్న గవర్నర్!


గత పది రోజుల నుంచి తమిళనాడులో సాగుతున్న హైడ్రామాకు నేటి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడింది. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ దోషేనని కోర్టు స్పష్టం చేయడంతో, తమిళ రాజకీయం క్లైమాక్స్ కు చేరుకుంది. నేడు కిక్కిరిసిన ఆరో నంబర్ కోర్టులో న్యాయమూర్తులు తీర్పును వెలువరించిన తరువాత, పన్నీర్ సెల్వం వర్గం ఆనందంలో మునిగిపోయి, మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేయగా, శశికళ వర్గం చిన్నబోయింది.

ఇక ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి బయటకు వచ్చిన తరువాత ఎంతమంది పన్నీర్ సెల్వం వైపు వస్తారన్నది కీలకాంశంగా మారింది. ఇక శశికళకు అవకాశం లేదని తేలిపోయింది కాబట్టి, గవర్నర్ రంగంలోకి దిగి పన్నీర్ సెల్వంను అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు నేటి సాయంత్రంలోగా రాజ్ భవన్ నుంచి పన్నీర్ కు పిలుపు వస్తుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News