: జస్టిస్ అమితవరాయ్ దీ అదేమాట... శశికళ ఆశలు అడియాశే!
అక్రమాస్తుల కేసు తీర్పు తరువాత శశికళ సీఎం ఆశలు అడియాసలయ్యాయి. సుప్రీంకోర్టులో రెండో న్యాయమూర్తి అమితవరాయ్ కూడా ఆమె దోషేనని ప్రకటించారు. లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం ఇస్తున్నట్టు వెల్లడించారు. తక్షణం లొంగిపోవాలని కోరారు. పదేళ్ల పాటు ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె అనర్హురాలని అన్నారు. ట్రయల్ కోర్టు తీర్పును అమలు చేయాలని, హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేస్తున్నామని ఆయన స్పష్టంగా చెప్పారు. కాగా, ఈ కేసులో అపీలు చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో, శశికళ జైలుకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.