: రహస్య సర్వే చేయించిన శశికళ... ఫలితాలు చూసి షాక్!


తమిళనాడు రాష్ట్రంలోని పరిస్థితులు, తమ నేతగా ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నలను సంధిస్తూ, శశికళ వర్గం అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలను భాగం చేస్తూ, ఓ రహస్య సర్వే నిర్వహించగా, దీని ఫలితాలు చూసి శశికళ షాక్ కు గురైనట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అత్యంత రహస్యంగా జరిగిన సర్వేలో ఏకంగా 98 శాతం మంది సీఎంగా పన్నీర్ సెల్వం ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారని, శశికళ సీఎం అయితే, భారీ ఎత్తున నిరసనలను క్షేత్రస్థాయిలో తెలియజేయాలని భావిస్తున్నారని తెలియడంతో శశికళ ఆందోళనతో ఉన్నారని తెలిపారు. పార్టీలో ఎంజీఆర్, జయలలిత తరువాత ఆ స్థాయిలో ఆదరణ పన్నీర్ కే ఉన్నట్టు స్పష్టం కావడంతో శశికళ వర్గం జీర్ణించుకోలేకుండా ఉందని తెలుస్తోంది. అయినా వెనక్కు తగ్గరాదని, ఒకసారి సీఎం పీఠమెక్కితే, ఆపై కార్యకర్తలను పిలిచి, వారికి సులువుగా నచ్చజెప్పవచ్చని, అందరికీ లాభం కలిగించే నిర్ణయాలతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని శశి భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News