: అలా మాట్లాడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా... స్పీకర్ కోడెల సవాల్


తాను మహిళలను అవమానిస్తూ మాట్లాడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సవాల్ విసిరారు. సోమవారం నరసరావుపేటలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలను తక్కువ చేసి మాట్లాడానంటూ రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు. పనిలేని వాళ్లు, అవకాశాలు రానివాళ్లు మాత్రమే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.

 ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విమర్శించడాన్ని కొందరు పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. నరసరావుపేటలో ఐదు రోజులపాటు ‘ఖేలో ఇండియా’ పేరుతో జాతీయ క్రీడలు నిర్వహిస్తే దానిపైనా విమర్శలు చేశారన్నారు. మహిళా పార్లమెంట్‌కు 12 వేల మందిని ఆహ్వానిస్తే 22 వేల మంది వచ్చారని కోడెల తెలిపారు.

  • Loading...

More Telugu News