: ప్రేమికుల రోజున అక్కడ అమ్మాయిలే అబ్బాయిలకు కానుకలిస్తారు!


ఫిబ్రవరి 14.. ప్రేమికులకు పండుగ రోజు. ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేసిన సెయింట్ వాలెంటైన్స్‌ను గుర్తు చేసుకుంటూ ప్రేమికులు జరుపుకునే ప్రపంచ పండుగ. అబ్బాయిలు వాలెంటైన్‌గా మారిపోయి మనసిచ్చిన వారికి కానుకలు ఇచ్చి వారి మనసులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే ఆచారం. జపాన్‌లో మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకం. అక్కడ అమ్మాయిలే అబ్బాయిలకు కానుకలిచ్చి తమ ‘హోన్‌మెయ్‘ (నిజమైన ప్రేమ) ను తెలియజేస్తారు.

జపాన్‌లో వాలెంటైన్స్ డేను తొలిసారి జరుపుకున్నప్పుడు ‘మేరీ చాక్లెట్’ అనే సంస్థ అమ్మాయిల్ని ఆకర్షించేందుకు సరికొత్త నినాదం తీసుకొచ్చింది. అబ్బాయిలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమకు ఇష్టమైన వారికి కానుకలిస్తారు. కానీ అమ్మాయిలకు మాత్రం ఆ చాన్స్ వాలెంటైన్స్ డే నాడు మాత్రమే వస్తుందంటూ ప్రచారం చేసింది. ఇక అప్పటి నుంచి అబ్బాయిలకు బహుమతులివ్వడాన్ని అమ్మాయిలు మొదలుపెట్టారు. ప్రతి ఏడాది అలాగే కొనసాగి, ఇప్పుడది సంప్రదాయంగా మారిపోయింది.

  • Loading...

More Telugu News