: ఫెయిలయిన ఆర్టీసీ బస్సు బ్రేకులు.. ఒకరి మృతి
ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిలవ్వడంతో ఆందోళన చెందిన ఇద్దరు ప్రయాణికులు బస్సులోంచి కిందకు దూకేశారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం వాంఖిడి వద్ద బ్రేక్స్ ఫెయిలయిన బస్సును డ్రైవర్ అదుపు చేయడానికి ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది.